Vijay: దూసుకుపోతున్న 'బీస్ట్' సాంగ్!

  • నెల్సన్ దిలీప్ కుమార్ తో విజయ్ 
  • భారీ బడ్జెట్ తో నిర్మితమైన 'బీస్ట్'
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్ 
  • ఏప్రిల్ 14వ తేదీన సినిమా రిలీజ్  
Beast movie lyrical song released

విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ 'బీస్ట్' సినిమాను రూపొందించాడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.    

హీరో శివకార్తికేయన్ పాటలు రాస్తాడనే విషయం తెలిసిందే. ఆయన రాసిన పాటను ఖరీదైన సెట్లో చిత్రీకరించారు. అనిరుధ్ స్వరపరిచిన ఆ పాటను రీసెంట్ గా రిలీజ్ చేయగా 1 మిలియన్ కి పైగా వ్యూస్ ను రాబట్టింది. జొనిత గాంధీతో కలిసి అనిరుధ్ ఈ పాటను ఆలపించాడు. యూత్ కి కనెక్ట్ అయ్యే ఈ బీట్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు.

దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ కి తమిళనాట మంచి క్రేజ్ ఉంది. విజయ్ స్టైల్ కి తగిన కథను సెట్ చేసుకుని ఆయన రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమాతో విజయ్ కొత్త రికార్డులను సెట్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాతో కోలీవుడ్ లోను పూజ హెగ్డే జోరు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

More Telugu News