GVL Narasimha Rao: చంద్రబాబు చెపితే మేము మారుస్తామా?: వైసీపీపై జీవీఎల్ ఫైర్

YSRCP making false propaganda says GVL Narasimha Rao
  • చంద్రబాబు చెపితే మేము అజెండా మార్చామని అంటున్నారు
  • వైసీపీ నేతల ప్రచారం అవాస్తవం
  • వైసీపీది ఆర్భాటమే తప్ప, చేసిందేమీ లేదన్న జీవీఎల్  
కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అజెండా నుంచి ప్రత్యేకహోదా అంశాన్ని తొలగించడం వెనుక తన హస్తం ఉందంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెపితే తాము అలా చేశామనే వైసీపీ నేతల ప్రచారం ముమ్మాటికీ అవాస్తవమని అన్నారు. చంద్రబాబు చెపితే తాము మారుస్తామా? అని ప్రశ్నించారు.

వైసీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏవైనా నిర్ణయాలు చేస్తే వాటిని తాము మార్చగలమా? అని ప్రశ్నించారు. వైసీపీ చేస్తున్న రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. వైసీపీది ఆర్భాటమే తప్ప.. చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. బీజేపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
GVL Narasimha Rao
BJP
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News