Vetrimaran: రూ. 18 లక్షల ఖరీదు చేసే బైక్ కొన్న సినీ దర్శకుడు

Director Vetrimaran buys new byke
  • బీఎండబ్ల్యూ హైస్పీడ్ బైక్ ను కొనుగోలు చేసిన వెట్రిమారన్
  • పలు హిట్ చిత్రాలను తెరకెక్కించిన వెట్రిమారన్
  • ప్రస్తుతం విజయ్ సేతుపతితో 'విడుతాలై' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మారన్
ప్రముఖ తమిళ సినీ దర్శకుడు వెట్రిమారన్ తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కలల బైక్ ను సొంతం చేసుకున్నాడు. బీఎండబ్ల్యూకు చెందిన హైస్పీడ్ సూపర్ బైక్ ను కొనుగోలు చేశాడు. దీని ధర రూ. 18 లక్షలకు పైనే అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బైక్ కు చెందిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వెట్రిమాన్ పలు హిట్ చిత్రాలను రూపొందించాడు. ప్రస్తుతం 'విడుతాలై' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, సూరి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్, కమలహాసన్, విజయ్ వంటి స్టార్లతో సినిమాలను తెరకెక్కించనున్నారు.
Vetrimaran
Kollywood
New Byke

More Telugu News