KCR: సర్జికల్ స్ట్రయిక్స్ పై కేసీఆర్ వ్యాఖ్యలకు అసోం సీఎం కౌంటర్!

  • రాహుల్ పై వ్యాఖ్యలపై హిమంతను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్న కేసీఆర్
  • సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపాలని కేసీఆర్ డిమాండ్
  • సైన్యాన్ని అగౌరవ పరిచేలా మాట్లాడుతున్నారన్న హిమంత
Assam CM HB Sarma counters CM KCR

సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని అడగడంలో తప్పేముందని నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాను కూడా కేంద్రాన్ని అదే డిమాండ్ చేస్తున్నానని... సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపాలని అడుగుతున్నానని చెప్పారు. సర్జికల్ స్ట్రయిక్స్ పై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

ఇటీవల రాహుల్ గాంధీని ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు కావాలని రాహుల్ అడిగారని... ఆయన రాజీవ్ కు పుట్టారనే ఆధారాలను బీజేపీ ఎప్పుడైనా అడిగిందా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ హిమంతపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. హిమంతను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు అసోం సీఎం కౌంటర్ ఇచ్చారు. పుల్వామా దాడి వార్షికోత్సవం సందర్భంగా సర్జికల్ స్ట్రయిక్స్ ను ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షాలు మళ్లీ మన అమరవీరులను అవమానించాయని అన్నారు. గాంధీ కుటుంబానికి తమ విధేయతను నిరూపించుకునే ప్రయత్నంలో వారు సైన్యానికి ద్రోహం చేసేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సైన్యం పట్ల తనకు ఎంతో విధేయత ఉందని అన్నారు. మీ జీవితకాలమంతా తనను విమర్శించినా తాను కేర్ చేయబోనని అన్నారు.

More Telugu News