Karthi: 'ఖైదీ' సీక్వెల్ కి తొలగిన అడ్డంకులు!

  • బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసిన కార్తి 'ఖైదీ'
  • సీక్వెల్ కోసం మొదలైన సన్నాహాలు
  • అనుకోకుండా ఎదురైన ఆటంకం
  • లోకేశ్ కనగరాజ్ కి అనుకూలంగా తీర్పు
Khaidi Movie has Sequel

కార్తి తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలలో రెండు సినిమాలు మాత్రం ప్రత్యేకమైన స్థానంలో కనిపిస్తాయి .. అవే 'ఖాకీ' .. 'ఖైదీ'. ఈ సినిమాలు రెండూ కూడా తమిళంతో పాటు తెలుగులోను భారీ వసూళ్లను రాబట్టాయి.

'ఖైదీ' సినిమాను సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి కార్తి .. లోకేశ్ వచ్చారు. అందుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టారు. అయితే ఈ కథ తనదేనంటూ ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లడం వలన, 'ఖైదీ' సినిమా రీమేక్ లకు .. సీక్వెల్ కి బ్రేక్ పడింది. ఈ విషయం ఎప్పుడు తేలుతుందోనని చాలామంది అనుకున్నారు.

ఈ క్రమంలో, ఈ కథ ఒరిజినల్ లోకేశ్ రాసుకున్నదేనని కోర్టు నుంచి ఆయనకి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీ అవుతోందట. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ మొదలవుతుందని అంటున్నారు. మొదటిభాగం ఎక్కడైతే ఆగిందో .. అక్కడి నుంచే సీక్వెల్ స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. కార్తి అభిమానులకు ఇది శుభవార్తనే.

More Telugu News