MSK Prasad: ఐపీఎల్ లో ఆంధ్రా క్రికెటర్లను తీసుకోకపోవడం నిరాశ కలిగించింది: ఎమ్మెస్కే ప్రసాద్

MSK Prasad disappoints with IPL franchises
  • ఆంధ్రా ప్రతిభావంతులను పట్టించుకోలేదన్న ఎమ్మెస్కే
  • ఫ్రాంచైజీల తీరు అర్థం కావడంలేదని వ్యాఖ్యలు
  • హనుమ విహారిని సైతం విస్మరించారని ఆవేదన

ఐపీఎల్ వేలం సరళిపై జాతీయ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిభ ఉన్నప్పటికీ ఎంతోమంది ఆంధ్రా క్రికెటర్లకు ఐపీఎల్ వేలంలో మొండిచేయి ఎదురవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. రికీ భుయ్, పృథ్వీరాజ్, స్టీఫెన్ వంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదని ఆరోపించారు.

అసలు, టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారి పేరు వేలంలో వినిపించకపోవడం బాధాకరమని అన్నారు. ఐపీఎల్ వేలంలో అనామకులు సైతం అవకాశాలు దక్కించుకున్నారని, అలాంటిది ఓ టీమిండియా ఆటగాడికి ఐపీఎల్ లో స్థానం లభించకపోవడం నిరాశ కలిగించిందని ఎమ్మెస్కే ఆవేదన వ్యక్తం చేశారు.

ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆలోచన ఏంటో అర్థం కావడంలేదన్నారు. తన్మయ్ అగర్వాల్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడని, అతడిని వేలంలో ఏదో ఒక ఫ్రాంచైజీ తప్పకుండా తీసుకుంటుందని భావిస్తే, అతడిని కూడా పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News