Rakhi Sawant: భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన రాఖీ సావంత్

Rakhi Sawant announces separation from husband Ritesh
  • సంచలన ప్రకటన చేసిన రాఖీ సావంత్
  • రితేశ్ తో వైవాహిక జీవితం విచ్ఛిన్నమైందని వెల్లడి
  • ఎవరి దారి వారిదేనని వివరణ
బాలీవుడ్ ఐటం భామ రాఖీ సావంత్ మరో బాంబు పేల్చింది. భర్త రితేశ్ నుంచి విడిపోతున్నట్టు ప్రకటించింది. బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత చాలా పరిణామాలు జరిగాయని వెల్లడించింది. రాఖీ సావంత్ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే, ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితంపై ప్రకటన చేసింది.

"ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులకు... నేను, రితేశ్ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. బిగ్ బాస్ షో తర్వాత చాలా ఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని నేను నియంత్రించలేనివి. సమస్యలను పరిష్కరించుకునేందుకు నేను, రితేశ్ చాలా చర్చించాం. కానీ సాధ్యపడలేదు. అందుకే ఇకపై ఎవరి జీవితం వాళ్లదే అని నిర్ణయించుకున్నాం. విడిపోయి సంతోషంగా బతకాలని భావిస్తున్నాం" అంటూ రాఖీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేసింది. ఇప్పటివరకు తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు అంటూ పేర్కొంది.
Rakhi Sawant
Ritesh
Husband
Separation

More Telugu News