Polling: ఉత్తరాఖండ్, గోవా, ఉత్తర్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Polling in three states has begun
  • ఉత్తరాఖండ్, గోవాల్లో ఒకే విడతలో పోలింగ్
  • యూపీలో నేడు రెండో దశ పోలింగ్
  • ఉత్తరాఖండ్ లో సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్
  • యూపీ, గోవాలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్

ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ పూర్తి కానుండగా, నేడు యూపీలో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని 55 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ చేపట్టారు. అక్కడ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఉత్తరాఖండ్ బరిలో 632 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 82,38,187 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ తొలిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా 101 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇక, గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒక్క విడతలోనే పోలింగ్ పూర్తి కానుంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు. గోవా ఎన్నికల బరిలో 301 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో 11,56,564 మంది ఓటర్లు ఉండగా... 1,722 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మార్చి 10న ఉంటుంది.

  • Loading...

More Telugu News