Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదిగో!

Here it is Sunrisers Hyderabad full squad
  • ముగిసిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలం
  • తాజా సీజన్ లో రాణిస్తామని సన్ రైజర్స్ ధీమా
  • గత సీజన్ లో సన్ రైజర్స్ దారుణ ప్రదర్శన
  • 14 మ్యాచ్ లు ఆడి 11 ఓటములు
ఐపీఎల్ లో సన్ రైజర్స్ ప్రస్థానం ఆసక్తికరం అని చెప్పాలి. గతంలో ఐపీఎల్ టైటిల్ ను కూడా అందుకున్న ఈ జట్టు 14వ సీజన్ లో మాత్రం దారుణ ప్రదర్శన కనబర్చింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలిచి అవమానకర పరిస్థితుల్లో టోర్నీని ముగించింది. మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ కేవలం 3 మ్యాచ్ ల్లోనే గెలిచింది. 11 మ్యాచ్ లలో ఓటమిపాలైంది.

అయితే, ఆ పరాజయాలను మరిపించేలా కొత్త సీజన్ లో కచ్చితంగా పుంజుకుంటామని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ధీమా వ్యక్తం చేస్తోంది. వేలం ముగిసిన తర్వాత సన్ రైజర్స్ ట్విట్టర్ లో స్పందించింది. ఐపీఎల్ నయా సీజన్ లో పక్కాగా రాణిస్తామని వెల్లడించింది. విజయాలు సాధించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

వేలం ముగిసిన తర్వాత సన్ రైజర్స్ జట్టు సభ్యులు వీరే...

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), నికోలాస్ పూరన్ (వికెట్ కీపర్), ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్ క్రమ్, విష్ణు వినోద్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్ (వికెట్ కీపర్), ఆర్.సమర్థ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, శశాంక్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, టి.నటరాజన్, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, షాన్ అబ్బాట్, సౌరభ్ దూబే, ఫజల్ హక్ ఫరూకీ.
Sunrisers Hyderabad
Full Squad
IPL
Auction

More Telugu News