IPL: ముగిసిన ఐపీఎల్ మెగా వేలం... రూ.30 లక్షలతో సచిన్ తనయుడ్ని కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్

  • బెంగళూరు వేదికగా ఐపీఎల్ ఆటగాళ్ల వేలం
  • రెండ్రోజుల పాటు సాగిన వేలం
  • మళ్లీ వేదికపైకి వచ్చిన ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్
  • చప్పట్లతో స్వాగతం పలికిన ఫ్రాంచైజీల సభ్యులు
IPL Mega Auction completed

ఐపీఎల్ 15వ సీజన్ కోసం రెండ్రోజుల పాటు సాగిన ఆటగాళ్ల మెగా వేలం ముగిసింది. చివర్లో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పేరు తెరపైకి రాగా, ముంబయి ఇండియన్స్ అతడిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అర్జున్ టెండూల్కర్ గత సీజన్ లోనూ ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించినా, గాయం కారణంగా సీజన్ కు దూరమాయ్యడు. మరి ఈసారైన ఆడే  అవకాశం వస్తుందో లేదో చూడాలి.

ఇక, ఐపీఎల్ వేలం తొలిరోజున అస్వస్థత కారణంగా తప్పుకున్న ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ నేటి వేలం ముగింపు సందర్భంగా తిరిగి పోడియం వద్దకు వచ్చారు. చివర్లో కొందరు ఆటగాళ్లను వేలం వేసి వేలం ప్రక్రియకు ముగింపునిచ్చారు. హ్యూ ఎడ్మీయడస్ వేదికపై వస్తుండగా, ఫ్రాంచైజీల సభ్యులు పైకి లేచి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎడ్మీయడస్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా, తన స్థానంలో వేలం ప్రక్రియను అత్యంత సమర్థంగా నిర్వహించిన క్రికెట్ ప్రజెంటర్ చారు శర్మను మనస్ఫూర్తిగా అభినందించారు.

More Telugu News