Team India: ఐపీఎల్ వేలం... జాక్ పాట్ కొట్టిన టీమిండియా అండర్-19 ఆటగాళ్లు

  • ఇటీవల అండర్-19 విజేతగా భారత యువజట్టు
  • ఐపీఎల్ వేలంలో గిరాకీ
  • రాజ్ బవాకు రూ.2 కోట్లు
  • హంగార్గేకర్ కు రూ.1.5 కోట్లు
  • రూ.50 లక్షల ధర పలికిన అండర్-19 జట్టు సారథి
Team India junior cricketers gets huge price in IPL auction

ఐపీఎల్ వేలం రెండోరోజున టీమిండియా అండర్-19 ఆటగాళ్ల పంటపండింది. ఇటీవలే భారత కుర్రాళ్లు వెస్టిండీస్ లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ గెలిచారు. ఇందులో విశేష ప్రతిభ కనబర్చిన యువకుల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలో పోటీపడ్డాయి. ఆల్ రౌండర్ రాజ్ అంగ్ బవాను రూ.2 కోట్లతో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా, మరో ఆల్ రౌండర్ రాజ్ వర్ధన్ హంగార్గేకర్ ను రూ.1.5 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకుంది.

రాజ్ బవా మీడియం పేస్ బౌలింగ్ తో పాటు మిడిల్ ఓవర్లలో ఉపయుక్తమైన రీతిలో బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక హంగార్గేకర్ టీనేజ్ వయసులోనే స్పీడ్ స్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వేగంగా బంతులు విసరడమే కాదు, ఆఖర్లో బ్యాట్ తోనూ విరుచుకుపడే సత్తా అతడి సొంతం. అందుకే వీరికి ఐపీఎల్ వేలంగా గిరాకీ ఏర్పడింది. వీళ్లు ఇంకా జూనియర్ క్రికెటర్లే అయినా కోటి రూపాయలకు పైగా ధర పలకడం వారి ప్రతిభకు నిదర్శనం.

ఇక, టీమిండియా అండర్-19 జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ యశ్ ధూల్ కు వేలంలో రూ.50 లక్షల ధర పలికింది. యశ్ ధూల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది.

నేటి వేలంలో ఇతర కొనుగోళ్లు...

  • యశ్ దయాళ్- రూ.3.20 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
  • తిలక్ వర్మ- రూ.1.70 కోట్లు (ముంబయి ఇండియన్స్)
  • డెవాన్ కాన్వే- రూ.1 కోటి (చెన్నై సూపర్ కింగ్స్)
  • మహిపాల్ లోమ్రోర్- రూ.95 లక్షలు (ఆర్సీబీ)
  • ఫిన్ అలెన్- రూ.80 లక్షలు (ఆర్సీబీ)
  • మహీశ్ తీక్షణ- రూ.70 లక్షలు (చెన్నై సూపర్ కింగ్స్)

  • Loading...

More Telugu News