Botsa Satyanarayana: ప్రత్యేక హోదాను సాధించేంత వరకు పోరాటం చేస్తాం: మంత్రి బొత్స

Botsa comments on AP Special Status issue
  • విజయనగరంలో బొత్స సమీక్ష
  • హోదా అంశంపై వ్యాఖ్యలు
  • హోదా అంశం విభజన చట్టంలో ఉందని వెల్లడి
  • సీఎం జగన్ కేంద్రంతో ప్రస్తావిస్తూనే ఉన్నారని వివరణ
విజయనగరంలో అధికారులతో సమీక్ష సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేకహోదా అంశంపై స్పందించారు. ప్రత్యేక హోదా అంశం అప్పటి విభజన చట్టంలో ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంపై సీఎం జగన్ పలు దఫాలుగా కేంద్రంతో ప్రస్తావిస్తూనే ఉన్నారని వెల్లడించారు. ప్రత్యేకహోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఏపీకి ప్రత్యేకహోదాను సాధించేంతవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇక, ఏపీకి మూడు రాజధానుల అంశంపైనా బొత్స అభిప్రాయాలను పంచుకున్నారు. ఎవరెన్ని చెప్పినా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం తమ విధానం అని అన్నారు. పరిపాలనా రాజధాని విశాఖకు వచ్చితీరుతుందని పేర్కొన్నారు.
Botsa Satyanarayana
AP Special Status
CM Jagan
Andhra Pradesh

More Telugu News