IPL: ముంబై ఇండియన్స్ బాధ్యతగా వ్యవహరించింది: ప్రీతి జింటా ప్రశంసలు.. నీతా అంబానీ కళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు

  • వేలంలో ఏ జట్టూ మాస్కులు పెట్టుకోని వైనం
  • ముంబై ఇండియన్స్ సభ్యులంతా మాస్కులతోనే
  • ఆ ఫొటోనే పోస్ట్ చేసిన ప్రీతి జింటా
  • కరోనా రూల్స్ పాటించిందంటూ ప్రశంస
  • నీతా అంబానీ కళ్లు చాలా బాగున్నాయని కామెంట్
Preity Zinta Commends Mumbai Indians Says Covid Compliant

ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా ప్రశంసల వర్షం కురిపించింది. ఐపీఎల్ మెగా వేలం సందర్భంగా ఏ జట్టు యాజమాన్యం కూడా మాస్కులు ధరించింది లేదు. ఒక్కరో ఇద్దరో తప్ప ఎవరూ మాస్కులు పెట్టుకోలేదు. ఒక్క ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు మాత్రమే మాస్కులు పెట్టుకుని వేలంలో పాల్గొనడం కనిపించింది.

ఇదే విషయాన్ని ఫొటో పెట్టి మరీ ప్రీతి జింటా మెచ్చుకుంది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం కరోనా నిబంధనలను పాటిస్తూ వేలంలో పాల్గొనడం చూస్తుంటే ఆనందంగా ఉందని కొనియాడింది. ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ కళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నీతా అంబానీ కళ్లు ఎంత బాగున్నాయో.. ఒప్పుకొని తీరాల్సిందేనంటూ ట్వీట్ చేశారు.

కాగా, వేలంలో నిన్న ఇషాన్ కిషన్ ను ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లకు తిరిగి తీసుకొచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటిదాకా ఈ వేలంలో అత్యధిక ధర ఇదే. కిషన్ తో పాటు జూనియర్ ఏబీ డివిలియర్స్ డెవాల్డ్ బ్రూయిస్ ను ముంబై పొందింది. పంజాబ్ జట్టు.. షారూక్ ఖాన్, బెయిర్ స్టో, ధావన్ , రబాడ వంటి కీలక ఆటగాళ్లను తీసుకుంది.

More Telugu News