Russia: ఉక్రెయిన్ ఉద్రిక్తతల నడుమ.. రష్యా ప్రాదేశిక జలాల్లోకి అమెరికా జలాంతర్గామి

Russia Alleges That US Sub Marine Enters Russia Territorial Waters
  • అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని రష్యా మండిపాటు
  • మాస్కోలోని మిలటరీ ప్రతినిధికి నోటీసులు
  • రష్యా ప్రకటనలో నిజం లేదన్న అమెరికా
  • అంతర్జాతీయ జలాల్లో తిరిగే హక్కు తమకుందని వెల్లడి
ఉక్రెయిన్ ఉద్రిక్తతల నడుమ మరో వివాదం చెలరేగింది. రష్యా ప్రాదేశిక జలాల్లోకి అమెరికా జలాంతర్గామిని పంపిందని రష్యా ఆరోపించింది. దీంతో తమ నావికాదళం అమెరికా జలాంతర్గామిని తరిమికొట్టిందని ప్రకటించింది. అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘిస్తూ జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోందంటూ మండిపడింది. ఈ ఘటనకు సంబంధించి మాస్కోలోని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధికి నోటీసులు జారీ చేశామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.

జపాన్ హొకాయిదో దీవుల్లోని ఉత్తరాన ఉన్న ఉన్న ద కురిల్స్ ప్రాంతం రష్యా అధీనంలో ఉంది. సోవియట్ సేనలు దానిని ఆక్రమించుకున్నప్పట్నుంచి రష్యానే దానిని సంరక్షిస్తోంది. ఇప్పుడు ఆ కురిల్ జలాల్లోకే అమెరికా తన జలాంతర్గామిని పంపి యుద్ధ సన్నద్ధ పరీక్షలు చేపట్టిందని రష్యా ఆరోపిస్తోంది.

అయితే, అమెరికా మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. అసలు తమ జలాంతర్గామి రష్యా జలాల్లోకి ప్రవేశించనే లేదని స్పష్టం చేసింది. రష్యా ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. రష్యా చెబుతున్న ప్రాంతం గురించి తాము ఇప్పుడేం మాట్లాడబోమని, అయితే, అంతర్జాతీయ జలాల్లో సురక్షితంగా ప్రయాణించే అధికారం, హక్కు తమకుందని అమెరికా మిలటరీ అధికార ప్రతినిధి కెప్టెన్ కైల్ రైయిన్స్ చెప్పారు.

కాగా, ఉక్రెయిన్ పై రష్యా ఏ క్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య.. అమెరికా, రష్యాలు ఇప్పటికే పరస్పర హెచ్చరికలు చేసుకున్న సంగతి తెలిసిందే. తాము రష్యాతో యుద్ధమంటూ చేస్తే అది మూడో ప్రపంచ యుద్ధం లాంటిదే అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. దాడి అంటూ జరిగితే రష్యా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఇప్పటికే ఉక్రెయిన్ కు మూడు దిక్కులా లక్ష మంది సైనికులను రష్యా మోహరించింది.
Russia
USA
Ukraine
Sub Marine
Vladimir Putin
Joe Biden

More Telugu News