Sarkaru Vaari Paata: 'సర్కారువారి పాట' సినిమా పాట లీక్.. ఇద్దరు అరెస్ట్!

Sarkaru Vaari Paata song leak two arrested
  • రేపు విడుదల కావాల్సి ఉన్న తొలి సింగిల్
  • అధికారికంగా విడుదల కాకముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షం
  • ఇద్దరిని పోలీసులకు అప్పగించిన మైత్రీ మూవీ మేకర్స్
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం 'సర్కారువారి పాట' విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ అధికారికంగా విడుదల కాకముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో షాక్ కు గురైన చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది. పాటను లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించిన మైత్రీ మూవీ మేకర్స్ వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పాట రిలీజ్ అయిన నేపథ్యంలో రేపు విడుదల కావాల్సిన పాటను ఈరోజే విడుదల చేశారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటించారు.
Sarkaru Vaari Paata
Tollywood
song
Leak
Mahesh Babu

More Telugu News