PSLV C52: రేపే పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం.. ప్రారంభమైన కౌంట్ డౌన్!

  • రేపు ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగం
  • ఈ తెల్లవారుజామున 4.29 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్
  • మూడు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ
Countdown started for PSLV C52 launch

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైంది. రేపు పీఎస్ఎల్వీ సీ-52 ని పరీక్షించనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ ను ప్రారంభించారు. మొత్తం 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. రేపు ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. పీఎస్ఎల్వీ ప్రయోగ ప్రక్రియను ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా మూడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. వీటిలో ఐఆర్ శాట్ 1ఏ, ఐఎన్ఎస్ 2టీడీ, విద్యార్థులు రూపొందించిన ఇన్ స్పైర్ శాట్ 1 ఉపగ్రహాలు ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది.

More Telugu News