Jogi Ramesh: ఈ నలుగురు ఏపీ ద్రోహులుగా మిగిలిపోతారు: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్

  • కేంద్ర కమిటీ అజెండా నుంచి ప్రత్యేకహోదాను తొలగించడం దారుణం
  • అజెండా మార్పుకు చంద్రబాబు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, జీవీఎల్ కారణం
  • జగన్ వల్లే ప్రత్యేక హోదా సాధ్యం 
These four persons are are against to special status says Jogi Ramesh

ఏపీ, తెలంగాణ విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అజెండా నుంచి ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ... అజెండా మార్పు వెనుక నలుగురు వ్యక్తులు ఉన్నారని అన్నారు. చంద్రబాబు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావులు అజెండా మార్పుకు కారణమని... వీరంతా ఏపీ ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పారు. ఈ నలుగురు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అజెండాను మార్పించారని ఆరోపించారు. అజెండాలో ప్రత్యేకహోదా అంశం లేదని జీవీఎల్ ప్రకటించారని అన్నారు.   ముఖ్యమంత్రి జగన్ వల్లే ప్రత్యేకహోదా సాధ్యమని అన్నారు. త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేకహోదాను చేర్చి, మళ్లీ తొలగించడం దారుణమని మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 17న కేంద్ర కమిటీ సమావేశం కానుంది.

More Telugu News