AP Special Status: అజెండాలో మార్పు చేసిన కేంద్ర హోంశాఖ... ప్రత్యేక హోదా అంశాన్ని తొలగిస్తూ తాజా ఉత్తర్వులు

  • కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
  • ఈ ఉదయం జారీ చేసిన సర్క్యులర్ లో మార్పులు
  • ఐదు అంశాలతో తాజా అజెండా
Union home ministry issues fresh circular

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఇప్పటివరకు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి కమిటీ ఈ నెల 17న సమావేశం ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ సమావేశం అజెండాలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం కూడా ఉందని వార్తలు వచ్చాయి.

అయితే, ఈ సమావేశం అజెండాలో కేంద్ర హోంశాఖ మార్పులు చేసింది. ఈ ఉదయం జారీ చేసిన అజెండాను సవరించి, కొత్తగా మరో అజెండా రూపొందించింది. ఆ మేరకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది.

కొత్త అజెండాలో కేవలం ఐదు అంశాలు మాత్రమే ఉన్నాయి. ఏపీఎస్ఎఫ్ సీ విభజన అంశం, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, నగదు నిల్వ, బ్యాంకు డిపాజిట్లు, పన్నుల విషయంలో లోటుపాట్లను కేంద్ర హోంశాఖ తాజా అజెండాలో చేర్చింది.

More Telugu News