Andhra Pradesh: ఏపీలో కొత్తగా 896 కరోనా కేసులు, 6 మరణాలు

AP Corona Status
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 24,066 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 206 కొత్త కేసులు
  • ఇంకా 24,454 మందికి చికిత్స

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 24,066 కరోనా పరీక్షలు నిర్వహించగా, 896 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 206 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 141, కృష్ణా జిల్లాలో 130, పశ్చిమ గోదావరి జిల్లాలో 113 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 8,849 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,12,029 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,72,881 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 24,454 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,694కి పెరిగింది.

  • Loading...

More Telugu News