CM KCR: మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోంది: సీఎం కేసీఆర్

CM KCR slams Modi govt
  • భువనగిరి జిల్లాలో కేసీఆర్ పర్యటన
  • రాయగిరి వద్ద బహిరంగ సభ
  • కేంద్రంపై ధ్వజమెత్తిన వైనం
  • సాగు చట్టాలతో రైతులను ఏడిపించారని ఆగ్రహం

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంపై నిప్పులు చెరిగారు. మోదీ సర్కారుకు పిచ్చి ముదురుతోందని అన్నారు. పిచ్చి పిచ్చి పాలసీలు తెచ్చి ప్రజలపై రుద్దుతున్నారని మండిపడ్డారు.

వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి ఏడాదిపాటు రైతులను ఏడిపించారని పేర్కొన్నారు. ఢిల్లీ వద్ద అన్నదాతలను అవమానించారని, గుర్రాలతో తొక్కించారని విమర్శించారు. ఆఖరికి ఉత్తరప్రదేశ్ లో రైతులపై కార్లను కూడా ఎక్కించారని ఆగ్రహం వెలిబుచ్చారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో ఆ వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకున్నారని, ప్రధాని స్వయంగా క్షమాపణ కోరారని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News