CM KCR: మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ను అడిగినా సాధ్యపడలేదు: సీఎం కేసీఆర్

CM KCR inaugurates Bhuvanagiri district collectorate
  • భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ ప్రసంగం
  • యాదాద్రి జిల్లా కావడం సంతోషదాయకమని వెల్లడి
  • ఎన్టీఆర్ అంశం ప్రస్తావన
సీఎం కేసీఆర్ నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాదాద్రి ఓ జిల్లాగా ఏర్పడుతుందని ఎవరూ ఊహించలేదని, ఇవాళ కలెక్టరేట్ భవనం ప్రారంభించడం సంతోషం కలిగిస్తోందని అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే పలు జిల్లాలను ఏర్పాటు చేయాలని భావించామని తెలిపారు. 'అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేయాలని నాడు ఎన్టీఆర్ ను కూడా అడిగాం. ఆయన కూడా మంచిర్యాలను జిల్లాగా చేస్తానని అన్నారు. ఎందుకో గానీ అది సాధ్యపడలేదు. అనేక అపోహలు అందుకు ప్రతికూలంగా మారాయి' అని కేసీఆర్ వివరించారు.
CM KCR
Yadadri Bhuvanagiri District
Collectorate Building
Manchiryal
NTR
Telangana
Andhra Pradesh

More Telugu News