Huge Edmeades: హ్యూ ఎడ్మీడియస్ కు విశ్రాంతి... చారుశర్మతో ఐపీఎల్ వేలం కొనసాగింపు

IPL auction will be continued with Charu Sharma
  • ఐపీఎల్ వేలంలో ఊహించని ఘటన
  • వేలం నిర్వహిస్తూ స్పృహకోల్పోయిన ఎడ్మీడియస్
  • పోస్టురల్ హైపోటెన్షన్ అని ఐపీఎల్ యాజమాన్యం వెల్లడి
  • ఎడ్మీడియస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వివరణ
ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ ఐపీఎల్ మెగా వేలం నిర్వహిస్తూ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లడం తెలిసిందే. దాంతో ఐపీఎల్ వేలాన్ని కొద్దిసేపు నిలిపివేశారు. దీనిపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పాలకమండలి ప్రకటన చేసింది. రక్తపోటు స్థాయులు ఒక్కసారిగా పడిపోవడంతో హ్యూ ఎడ్మీడియస్ పోస్టురల్ హైపోటెన్షన్ తో కుప్పకూలారని వివరించింది.

ఈ ఘటన దురదృష్టకరమని ఐపీఎల్ యాజమాన్యం పేర్కొంది. ఆయనను వైద్య నిపుణులు నిశితంగా పరిశీలించారని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించింది. దీంతో ఐపీఎల్ ఆటగాళ్ల వేలాన్ని చారుశర్మతో కొనసాగిస్తున్నట్టు తెలిపింది.

చారుశర్మ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత, టీవీ ప్రజెంటర్. ప్రొ కబడ్డీ లీగ్ లో డైరెక్టర్ గానూ ఉన్నారు. టీవీ చానళ్లలో క్విజ్ లు నిర్వహించడంలో దిట్టగా చారుశర్మ గుర్తింపు తెచ్చుకున్నారు.
Huge Edmeades
IPL
Auction
Charu Sharma

More Telugu News