Roja: కేసీఆర్ కారణజన్ముడు: యాదాద్రిలో రోజా

Roja praises KCR
  • యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రోజా
  • ఆలయాన్ని నిర్మించే అవకాశాన్ని కేసీఆర్ కు దేవుడిచ్చాడని వ్యాఖ్య
  • భగవంతుడే కేసీఆర్ ద్వారా ఆలయాన్ని నిర్మించుకున్నాడు
వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈరోజు తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మాణం చేయిస్తున్నారని కొనియాడారు. ఈ కాలంలో ఎవరికీ దక్కని గొప్ప అవకాశం కేసీఆర్ కు మాత్రమే దక్కిందని అన్నారు.

గతంతో పోలిస్తే ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని చెప్పారు. ఆలయ నిర్మాణానికి వాడిన గ్రానైట్ ను గుంటూరు నుంచి తెచ్చారని తెలిపారు. కేసీఆర్ కారణజన్ముడని, భగవంతుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నిర్మించుకున్నాడని చెప్పారు. లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా పవర్ ఫుల్ అని... ఆయనకు ఇంత పెద్ద గుడి కట్టాలంటే ఆయన ఆశీస్సులు ఉండాలని అన్నారు. దేవుడి సహకారంతో ఆలయాన్ని కేసీఆర్ నిర్మించారని చెప్పారు.
Roja
YSRCP
KCR
TRS
Yadadri temple

More Telugu News