Huge Edmeades: ఐపీఎల్ వేలంలో అపశ్రుతి... వేలం నిర్వహిస్తున్న హ్యూ ఎడ్మీయడస్ కుప్పకూలిన వైనం.. ఆసుపత్రికి తరలింపు

IPL auctioneer Huge Edmeades collapsed while auctioning
  • నేడు ఐపీఎల్ వేలం ప్రారంభం
  • తొలి సెట్ వేలం పూర్తి
  • ఆటగాళ్ల వివరాలు ప్రకటిస్తూ నేలకొరిగిన ఆక్షనీర్  
ఐపీఎల్ వేలంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఓ ఆటగాడి రేటు వివరాలు ప్రకటిస్తూ ఉన్నట్టుండి ముందుకు వాలిపోయారు. దాంతో ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న వివిధ ఫ్రాంచైజీలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో టీవీ చానళ్లలో లైవ్ ప్రసారం కూడా ఆపేశారు. ఎడ్మీయడస్ ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.

హ్యూ ఎడ్మీయడస్ బ్రిటన్ జాతీయుడు. 2018 నుంచి ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్నారు. గతంలో రిచర్డ్ మ్యాడ్లీ ఐపీఎల్ వేలం నిర్వహించగా, మ్యాడ్లీ బ్రిటన్ లో అంపైర్ గా నియమితుడు కావడంతో, అతడి స్థానంలో ఎడ్మీయడస్ వేలం నిర్వహణ చేపట్టారు. గత కొన్ని సీజన్లుగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా వేలం నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు.
Huge Edmeades
IPL

More Telugu News