Telangana: నృసింహుడి ఆలయం కనిపించేలా యాదాద్రి ప్రెసిడెన్షియల్ సూట్.. ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR Unveiled Presidential Suit In Yadadri
  • వీవీఐపీ కాటేజీలు, విల్లాల ప్రారంభోత్సవం
  • యాగశాలలను పరిశీలించిన ముఖ్యమంత్రి 
  • కలెక్టరేట్ , టీఆర్ఎస్ ఆఫీసులనూ ప్రారంభించనున్న సీఎం
సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి పర్యటనకు వెళ్లారు. నూనతంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, వీవీఐపీ కాటేజీలు, విల్లాలను ఆయన ప్రారంభించారు. అనంతరం వాటిని పరిశీలించారు. తర్వాత యాదాద్రి యాగశాలను ఆయన పరిశీలించనున్నారు. తదనంతరం భువనగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా ఆఫీసును ప్రారంభించి.. కలెక్టరేట్ పక్కన జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

కాగా, ప్రెసిడెన్షియల్ సూట్ ను 1,500 చదరపుటడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. లక్ష్మీనృసింహుడి ఆలయ వీక్షణ కోసం అందులో ప్రత్యేకంగా ఒక వ్యూ పాయింట్ ను ఏర్పాటు చేశారు. యాదాద్రి చిన్నకొండపై 14 విల్లాలు, ఒక మెయిన్ సూట్ ను 13.25 ఎకరాల్లో నిర్మించారు.
Telangana
KCR
Yadadri
TRS

More Telugu News