RRR: 'ఆర్ఆర్ఆర్' టీమ్ లో కొత్త కలవరం.. భయపెడుతున్న రెండు అంశాలు!

  • మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'ఆర్ఆర్ఆర్'
  • అదే సమయంలో విద్యార్థులకు పరీక్షలు
  • మార్చి చివర్లో ఐపీఎల్ ప్రారంభమయ్యే అవకాశం 
Exams and IPL worrying RRR release

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ సైతం ఈ చిత్రం కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు తొలి నుంచి కూడా ఈ చిత్రానికి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. తాజాగా మరో సమస్య ఈ చిత్రాన్ని వేధిస్తోంది. పలు కారణాల వల్ల ఇప్పటి వరకు విడుదల వాయిదా పడిన ఈ చిత్రం... మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక్కడే ఈ చిత్ర దర్శకనిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

మార్చి నెల అంటే పరీక్షల సీజన్. విద్యార్థులందరూ పరీక్షల ప్రిపరేషన్ లో ఉంటారు. దీంతో ఈ సమయంలో ఎక్కువగా సినిమాలు విడుదల కావు. మరోవైపు మార్చి చివరి వారంలో కానీ లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ లో ఈసారి 10 జట్లు పాల్గొంటున్నాయి. దీంతో, ఈ టోర్నీ సుదీర్ఘంగా కొనసాగనుంది. ఓ వైపు పరీక్షలు, మరోవైపు ఐపీఎల్... తమ చిత్రంపై ప్రభావం చూపే అవకాశమున్నాయని కలవరపడుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఏం జరగబోతోందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News