Sajjala Ramakrishna Reddy: అలాగైతే ఈ రెండేళ్ల‌లో ఏపీ అభివృద్ధిలో పరుగులు తీసేది: సజ్జల వ్యాఖ్య‌లు

sajjala on ap govt situation
  • ఆంధ్ర ప్ర‌దేశ్‌ ఆర్థిక పరిస్థితి బాగోలేదు
  • కరోనా వల్ల దిగ‌జారింది
  • ఆ ప‌రిస్థితుల నుంచి గట్టేక్కించేందుకు జగన్ చ‌ర్య‌లు
  • జ‌గ‌న్ చొరవతో సమస్యలు పరిష్కారమవుతున్నాయన్న సజ్జల 
ఆంధ్రప్ర‌దేశ్‌ ఆర్థిక పరిస్థితి బాగుంటే రెండున్నర సంవ‌త్స‌రాల్లో అభివృద్ధి విషయంలో పరుగులు తీసేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ రోజు ఆయ‌నతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆ తర్వాత సజ్జల రామ‌కృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగ‌జారింద‌ని, ఆ ప‌రిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు సీఎం జగన్ ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని చెప్పారు. జ‌గ‌న్ చొరవతో సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. ఏపీ సుభిక్షంగా ఉండాల‌ని, అలాగే, కేంద్ర ప్ర‌భుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు పరిష్కారం కావాలని శ్రీవారిని కోరుకున్నాన‌ని ఆయ‌న చెప్పారు.
Sajjala Ramakrishna Reddy
Andhra Pradesh
YSRCP

More Telugu News