Dhanush: మరో ప్రయోగం చేస్తున్న ధనుశ్!

  • ధనుశ్ తాజా చిత్రంగా 'నానే వరువేన్'
  • సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం
  • సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
  • ఈ ఏడాది చివరిలో విడుదల
Dhanush Naane Varuven Movie Update

కోలీవుడ్ లో కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే కథానాయకులలో కమల్ ముందుగా కనిపిస్తారు. ఆ తరువాత స్థానంలో విక్రమ్ .. సూర్య నిలుస్తారు. ఇక వాళ్లిద్దరి బాటలోనే నడిచే హీరోగా ధనుశ్ కనిపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ధనుశ్ కథాపరంగా .. పాత్రల పరంగా ప్రయోగంతో కూడిన సాహసాలే చేస్తున్నాడు.

ఆయన తాజా చిత్రమైన 'నానే వరువేన్' కూడా వైవిధ్యభరితమైన సినిమానే. ఈ సినిమాలో ధనుశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ రెండు పాత్రలకి సంబంధించిన లుక్స్ ను ఒకే పోస్టర్ ద్వారా నిన్న రిలీజ్ చేశారు. ఒక పాత్ర డీసెంట్ గా ఉంటే, మరో పాత్ర అందుకు పూర్తి భిన్నంగా .. మానసిక స్థితి సరిగ్గాలేని ఒక మాస్ పాత్ర అనిపిస్తోంది.

ఈ పోస్టర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందుజ రవిచందర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమాను, ఈ ఏడాది చివరిలో విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News