Conistable: మూడు రోజుల క్రితమే పెళ్లి సంబంధం చూశారు.. తుపాకీ మిస్ ఫైర్ అయి కానిస్టేబుల్ మృతి!

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం
  • కాచనపల్లి పీఎస్ లో తుపాకీ పేలి కానిస్టేబుల్ సంతోష్ మృతి
  • మృతుడిది వరంగల్ జిల్లా గవిచర్ల గ్రామం
Constable dead as gun misfires

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొమరారం పరిధి కాచనపల్లి పోలీస్ స్టేషన్ లో తుపాకీ మిస్ ఫైర్ అయి కానిస్టేబుల్ మృతి చెందారు. ఆయుధాలను పరిశీలిస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడు సంతోష్ ది వరంగల్ జిల్లా గవిచర్ల గ్రామం. మరో దారుణ విషయం ఏమిటంటే... మూడు రోజుల క్రితమే సంతోష్ కి పెళ్లి సంబంధం చూశారు. ఇంతలోనే ఈ దారుణం సంభవించింది. సంతోష్ మృతి వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు.

More Telugu News