దుబాయ్ ఎక్స్ పోలో ఏపీ పెవిలియన్ ప్రారంభించిన మంత్రి మేకపాటి
- దుబాయ్ లో ఎక్స్ పో-2020
- ఇండియన్ పెవిలియన్ భవనంలో ఏపీ పెవిలియన్ ఏర్పాటు
- ప్రారంభోత్సవానికి విచ్చేసిన యూఏఈ మంత్రి
కాగా, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆకర్షించేలా ఏపీ పెవిలియన్ ను తీర్చిదిద్దారు. ఏపీలో పెట్టుబడులు, సానుకూలాంశాలపై ఈ పెవిలియన్ ద్వారా అవగాహన కలిగించనున్నారు. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ పార్కులు, ఫిషింగ్ హార్బర్ల వీడియోలను, విద్య, వైద్య, టూరిజం, ఐటీ, పోర్టులపై వీడియోలను పెవిలియన్ లో ప్రదర్శిస్తారు. ఏపీలో మౌలిక సదుపాయాలు, ఎగుమతి అవకాశాలపై వివరణ కోసం 12 స్క్రీన్లు ఏర్పాటు చేశారు.