Varla Ramaiah: జగన్ పాలనకు ముగింపు పలకాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది: వర్ల రామయ్య

Every one has responsibility to end Jagan rule says Varla Ramaiah
  • ప్రజల భవిష్యత్తును వారే చక్కదిద్దుకోవాలి
  • పాలన చేయమంటే జగన్ వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారు
  • ప్రశ్నించే నోటిని నొక్కడం ప్రజాస్వామ్యం కాదు

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరి మీద ఉందని ఆయన అన్నారు. మీ భవిష్యత్తును మీరే చక్కదిద్దుకోవాలని చెప్పారు. ప్రజా పాలన చేయమంటే వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. అందులో భాగమే అర్ధరాత్రి అశోక్ బాబు అరెస్ట్ అని అన్నారు. ప్రశ్నించే నోటిని నొక్కడం ప్రజాస్వామ్యం కాదని... అరాచకపాలన అని విమర్శించారు.

  • Loading...

More Telugu News