మెడలు విరిచి దళిత యువతి దారుణ హత్య.. యూపీలో మాజీ మంత్రి తనయుడి ఆశ్రమం సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహం
- రెండు నెలల క్రితం కనిపించకుండాపోయిన యువతి
- నిన్న బయటపడిన మృతదేహం
- పోస్ట్ మార్టంలో విస్తుపోయే విషయాలు
దుండగులు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం పంపించారు. పోస్ట్ మార్టంలో ఈ విస్తుపోయే నిజాలు తెలిశాయి. మెడలు విరిచేయడంతో పాటు తలమీద రెండు గాయాలున్నట్టు తేలింది.
కాగా, డిసెంబర్ 8న తమ బిడ్డ కనిపించకుండా పోయిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించలేదని చనిపోయిన యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎవరితోనో పారిపోయింది.. వస్తుందిలే అంటూ గేలి చేశారని అన్నారు. ఎస్పీని కూడా కలవనివ్వలేదన్నారు. అయితే, ఆ ఆరోపణలను పోలీసులు ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ శశి శేఖర్ సింగ్ చెప్పారు. కేసుకు సంబంధించి మాజీ మంత్రి కుమారుడు రాజోల్ సింగ్ ను విచారిస్తున్నామన్నారు.