Balakrishna: బొత్స సత్యనారాయణ కుమారుడి పెళ్లి వేడుకలో పలు పార్టీల నేతలు.. వీడియో ఇదిగో

balakrishna video goes viral
  • టీడీపీ నేత బాల‌య్య హాజ‌రు
  • తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా
  • కాంగ్రెస్ నేత శ్రీ‌ధ‌ర్ బాబుతో ముచ్చ‌ట‌
  • కేటీఆర్ తో సెల్ఫీ దిగేందుకు వైసీపీ నేత‌ల పోటీ
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి పెళ్లి వేడుక ఈ రోజు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జ‌రుగుతోంది. ఈ వివాహానికి టీడీపీ నేత నంద‌మూరి బాల‌కృష్ణ హాజరయ్యారు. ఆయ‌న‌ను బొత్స కుటుంబ స‌భ్యులు సాద‌రంగా ఆహ్వానించారు.

మ‌రోవైపు ఈ వివాహానికి తెలంగాణ‌ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కేటీఆర్, శ్రీధర్ బాబు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవ‌డం ఆస‌క్తి రేపింది. మరోపక్క, కేటీఆర్‌తో ఫొటోలు దిగేందుకు వైసీపీ నేతలు, పెళ్లికి హాజరైన కార్యకర్తలు పోటీప‌డ‌డం గ‌మ‌నార్హం.

   
Balakrishna
Viral Videos
Telugudesam
Botsa

More Telugu News