Russians: రష్యా, అమెరికా పరస్పరం కాల్పులకు దిగితే అది మరో ప్రపంచ యుద్ధమే: జో బైడెన్

That is a world war When Americans and Russians start shooting one another
  • అమెరికన్లను ఉక్రెయిన్ వదిలి వచ్చేయమన్న బైడెన్ 
  • చాలా భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నామంటూ వ్యాఖ్య
  • ఉక్రెయిన్ కు దళాలను పంపించబోమని స్పష్టీకరణ 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లోని తమ దేశ పౌరులకు కీలకమైన పిలుపునిచ్చారు. వెంటనే ఉక్రెయిన్ వీడి వచ్చేయాలని సూచించారు. రష్యా ప్రత్యక్ష కాల్పుల కసరత్తులతో, యుద్ధ సన్నద్ధత పరీక్షించుకుంటున్న తరుణంలో, ఉక్రెయిన్ పై రష్యా ఎప్పుడైనా దాడి చేయవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ పిలుపు రావడం గమనార్హం. 1,30,000 మంది రష్యా సైనికులు ఆయుధ సంపత్తితో ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించి ఉన్నారు.

‘‘ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంతో డీల్ చేస్తున్నాము. పరిస్థితి చాలా భిన్నమైనది. చాలా వేగంగా అదుపుతప్పి పోవచ్చు’’ అని జో బైడెన్ పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లోనూ తాను ఉక్రెయిన్ కు దళాలను పంపించేది లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగితే అమెరికన్లను రక్షించేందుకు కూడా దళాలు పంపించబోనన్నారు.

‘‘రష్యన్లు, అమెరికన్లు ఒకరిపై ఒకరు కాల్పులకు దిగితే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. మనం ఇప్పుడు చాలా భిన్నమైన ప్రపంచంలో ఉన్నాం’’ అని బైడెన్ పేర్కొన్నారు. ఆయన మాటలను బట్టి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగితే తాము జోక్యం చేసుకోబోమన్నట్టుగా ఉంది. మరో ప్రపంచ యుద్ధం రాకూడదన్నది బైడెన్ యోచనగా ఉంది.

  • Loading...

More Telugu News