FIR Movie: విష్ణు విశాల్ హీరోగా నటించిన 'ఎఫ్ఐఆర్' సినిమాపై మూడు దేశాలలో బ్యాన్

  • ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎఫ్ఐఆర్'
  • మోస్ట్ వాంటెడ్ ముస్లిం యువకుడి పాత్రలో విష్ణు
  • సినిమాను బ్యాన్ చేసి కువైట్, మలేషియా, ఖతార్
Three countries ban Vishnu Vishals FIR movie

తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన తాజా చిత్రం 'ఎఫ్ఐఆర్'. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు మూడు దేశాలు షాకిచ్చాయి. కువైట్, మలేషియా, ఖతార్ లలో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా వెల్లడించారు. సినిమాలోని ప్రధాన కంటెంట్ కారణంగా... సెన్సార్ ను ఈ సినిమా క్లియర్ చేయలేకపోయినట్టు సమాచారం.

ఈ చిత్రంలో మంజిమా మోహన్, రైజా విల్సన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గౌరవ్ నారాయణన్, రెబా మోనికా జాన్ తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాలో విష్ణు విశాల్ మోస్ట్ వాంటెడ్ ముస్లిం యువకుడిగా నటించగా.. గౌతమ్ మీన్ పోలీసు అధికారిగా నటించారు.

More Telugu News