Karnataka: హిజాబ్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం

  • కాలేజీ విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై వివాదం
  • వివాదం పెండింగ్ లో ఉన్నంత కాలం మతపరమైన దుస్తులు ధరించవద్దన్న హైకోర్టు
  • తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
Karnata High court commets on hijab

విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించడంపై దాఖలైన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈరోజు విచారించింది. ఈ వివాదం పెండింగులో ఉన్నంత కాలం విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించరాదని ఆదేశించింది. విద్యాసంస్థలను తెరుచుకోవచ్చని తెలిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ ను విచారించేందుకు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ట ఎస్ దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని నిన్న హైకోర్టు ఏర్పాటు చేసింది.

More Telugu News