Jagan: విశాఖకు రండి.. ఇళ్ల స్థలాలు, స్టూడియోలకు స్థలాలు ఇస్తా: సినీ హీరోలకు జగన్ ఆఫర్

Jagan offers land to tollywood heroes
  • అందరూ విశాఖకు షిఫ్ట్ అవ్వండి
  • ఏపీని పెద్ద సినిమా హబ్ గా మారుద్దాం
  • టాలీవుడ్ కు ఏపీ నుంచే ఎక్కువ వస్తోంది
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సినీ స్టార్లు చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరి భేటీ ఆశాజనకంగా సాగింది. సినీ పరిశ్రమను ఏపీకి తీసుకురావాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. అంతేకాదు విశాఖకు వస్తే బంపర్ ఆఫర్లను ఇస్తానని చెప్పారు.
 
'ఏపీకి షిఫ్ట్ అవ్వండి. వైజాగ్ కు వచ్చేయండి. అందరికీ స్థలాలిస్తా. ఏపీని పెద్ద సినిమా హబ్ గా మారుద్దాం. టాలీవుడ్ కి తెలంగాణ కంటే ఏపీ నుంచే ఎక్కువగా వస్తోంది. జనాభా పరంగా కూడా ఏపీ జనాభానే ఎక్కువ. థియేటర్లు కూడా ఏపీలో ఎక్కువగా ఉన్నాయి.
 
విశాఖలో వాతావరణం కూడా బాగుంటుంది. విశాఖలో అందరికీ స్థలాలిస్తా. జూబ్లీహిల్స్ లాంటి ఒక ఏరియాను క్రియేట్ చేద్దాం. స్టూడియోలు పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉన్న వారు ముందుకొస్తే వారికి కూడా స్థలాలిస్తా. మన రాష్ట్రంలో పెద్ద సిటీ విశాఖ. చెన్నై, బెంగళూరు, హైదరాబాదులతో కొంతమేర పోటీ పడగలిగిన స్థాయి విశాఖకు ఉంది.

అయితే మనందరం కలసికట్టుగా ఉంటేనే, విశాఖను మన సొంత నగరంగా భావిస్తేనే, మనందరం అక్కడకు వెళ్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ రోజు కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో, ఇరవై ఏళ్లకో ఈ నగరాలకు సమానంగా ఏదో ఒక స్థాయిలో ఉంటుంది. ఇది సాధించాలంటే అన్నింటికన్నా ముందు ఫిలిం ఇండస్ట్రీ విశాఖకు రావాలి. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఇది' అని జగన్ చెప్పారు.
Jagan
YSRCP
Tollywood
Chiranjeevi
Mahesh Babu
Prabhas
Vizag

More Telugu News