Revanth Reddy: టీచర్లపై కేసీఆర్ ఉక్కుపాదం.. కేంద్రం జోక్యం చేసుకోవాలి: రేవంత్ రెడ్డి

Revanth Requests Central Home Ministry On GO 317
  • జీవో 317ను కేంద్ర హోంశాఖ రద్దు చేయాలని విజ్ఞప్తి
  • టీచర్లు కన్నతల్లి, జన్మభూమికి దూరమై క్షోభ పడుతున్నారు
  • జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమన్న టీపీసీసీ చీఫ్

జీవో 317పై కేంద్ర హోం శాఖ జోక్యం చేసుకోవాలని, టీచర్లకు అన్యాయం చేస్తున్న ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ తెచ్చిన ఆ జీవోతో ఉపాధ్యాయులంతా కన్నతల్లి, జన్మభూమికి దూరమై క్షోభ అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జీవో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన ఆరోపించారు.

ఉపాధ్యాయుల ఆందోళనపై కేసీఆర్ సర్కారు ఉక్కుపాదం మోపుతోందని, వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. 317 జీవో రద్దు డిమాండ్ తో నిన్న హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద మహాధర్నాకు తరలివచ్చిన టీచర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. చాలా మంది టీచర్లను నిర్బంధంలోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News