Rohit Sharma: కేఎల్ రాహుల్, సూర్య భాగస్వామ్యం అదుర్స్.. ఆ పరిపక్వతే మాకు అవసరమన్న రోహిత్ శర్మ

Rohit Sharma lauds bowlers after win in 2nd ODI vs WI
  • సూర్య బౌలింగ్ తో పెరిగిన విశ్వాసం
  • బౌలింగ్ లో అసాధారణ పనితీరు
  • దీర్ఘకాల దృష్టితోనే ప్రయోగాలు
  • శిఖర్ తర్వాతి మ్యాచ్ ఆడతాడు
వెస్టిండీస్ తో రెండో వన్డే మ్యాచ్ లోనూ విజయం సాధించి.. మూడు మ్యాచుల సిరీస్ ను భారత్ జట్టు సొంతం చేసుకోవడం పట్ల కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు.

విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. ప్రసిద్ధ్ తన బౌలింగ్ తో వెస్టిండీస్ ప్లేయర్లను ఇబ్బంది పెట్టడమే కాకుండా, నాలుగు కీలకమైన వికెట్లను తన ఖాతాలో వేసుకుని భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం తెలిసిందే.

‘‘సిరీస్ ను గెలుచుకోవడం పట్ల ఎంతో ఆనందంగా ఉంది. మ్యాచ్ లో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాము. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ భాగస్వామ్యం ఇందులో ఒకటి. ఇలాంటి పరిపక్వత మాకు కావాల్సింది. గౌరవప్రదమైన విజయాన్ని సాధించాము.

బౌలింగ్ లో అసాధారణ పనితీరు చూపించాము. జట్టు అంతా ఒక్కటిగా కలసి కృషి చేసింది. అలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం కూడా కుర్రాళ్లకు కీలకమే. అప్పుడే వారి ప్రదర్శనపై తీర్పు చెప్పగలం.

సూర్య ఎంతో నమ్మకాన్ని కలిగించాడు. పిచ్ అంత సులభంగా లేదు. బ్యాటింగ్ తో జట్టు ఏం కోరుకుంటుందో అది సాధించి చూపించాడు. కేఎల్ రాహుల్ కూడా అంతే. చివర్లో హుడా కూడా మంచి ప్రదర్శనే ఇచ్చాడు

తదుపరి మ్యాచ్ కు శిఖర్ తిరిగి జట్టులోకి చేరతాడు. మేము దీర్ఘకాల దృష్టితో కొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో కొన్ని ప్రాధాన్యం కాని మ్యాచులు కోల్పోయినా నష్టం లేదు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. భారత జట్టు చేస్తున్న ప్రయోగాలను మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టిన నేపథ్యంలో రోహిత్ శర్మ వ్యాఖ్యలు దానికి సమాధానం ఇచ్చినట్టు అయింది.
Rohit Sharma
West Indies
ODI
2nd match
bowling
batting

More Telugu News