BV Raghavulu: దేశ సంపదను క్లియరెన్స్ సేల్ కింద మోదీ అమ్మేస్తున్నారు: బీవీ రాఘవులు

BV Ragahavulu fires on Modi
  • ‘అమ్మకానికి భారతదేశం’ అంశంపై సీఐటీయూ సదస్సు
  • మోదీ ఏడేళ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి
  • బీజేపీ నిర్ణయాలను వైసీపీ సమర్థించడం బాధాకరం
  • బహుశా జైలుకు వెళ్లాల్సి వస్తుందనేమో
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిన్న తిరుపతిలో ‘అమ్మకానికి భారతదేశం’ అంశం జరిగిన సదస్సులో రాఘవులు మాట్లాడుతూ.. క్లియరెన్స్ సేల్ కింద మోదీ ఈ దేశాన్ని అదానీ, అంబానీలకు అమ్మేస్తున్నారని విమర్శించారు. మోదీ ఏడేళ్ల పాలనలో దేశ ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్ధితి ఆందోళనకర స్థాయిలో దిగజారిందన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్, కృష్ణపట్నం ఓడరేవు వంటి వాటిని కేంద్రం అమ్మకానికి పెట్టేసిందన్నారు. రాష్ట్రానికి తీరని ద్రోహం జరుగుతున్నప్పటికీ అధికార పార్టీ నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోతాయనో, జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయం వల్లోనే తెలియదు కానీ బీజేపీ నిర్ణయాలను వైసీపీ నేతలు సమర్థించడం బాధాకరమని రాఘవులు అన్నారు. ప్రతిపక్షం కూడా దీనిపై గొంతెత్తడం లేదని రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు.
BV Raghavulu
CPM
Narendra Modi
Tirupati

More Telugu News