Perni Nani: సీఎంను కలవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు వస్తున్నారో రేపు చెబుతాం: మంత్రి పేర్ని నాని

Perni Nani says Tollywood delegation will meet CM Jagan tomorrow
  • ఇంకా అపరిష్కృతంగా సినిమా టికెట్ల అంశం
  • సీఎంతో భేటీకి టాలీవుడ్ బృందం
  • చిరంజీవి, తదితరులు వస్తున్నారని ప్రచారం
  • మీడియాతో మాట్లాడిన పేర్ని నాని
రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు సమావేశం అవుతున్నారని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి వారు సీఎంతో చర్చిస్తారని తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు, లేదా, మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఉండొచ్చని అన్నారు.

కాగా, సినీ పరిశ్రమ నుంచి ఎవరు వస్తారో రేపు ఉదయం చెబుతామని పేర్ని నాని తెలిపారు. సినీ పరిశ్రమ పెద్దల నుంచి తమకేమీ చర్చల అజెండా అందలేదని వెల్లడించారు. సినిమా టికెట్ల ధరలపై కమిటీ నివేదిక ఇంకా రాలేదని, కమిటీ నివేదిక వచ్చాక పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
Perni Nani
Tollywood
CM Jagan
Cinema Tickets prices
Andhra Pradesh

More Telugu News