BJP: తెలంగాణ ధరణి పోర్టల్ లో పీవోకేను పాకిస్థాన్ లో కలిపేశారు: బీజేపీ ఆరోపణ

BJP fires on TRS over map in Dharani portal
  • టీఆర్ఎస్ తో బీజేపీ మాటల యుద్ధం
  • ధరణి సైట్ లో తప్పుడు మ్యాప్ పెట్టారన్న బీజేపీ
  • టీఆర్ఎస్ నిర్వాకం అంటూ సోషల్ మీడియాలో పోస్టు
  • కనీసం తెలంగాణ మ్యాప్ సంపాదించలేకపోయారని విమర్శలు

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. తెలంగాణ ధరణి పోర్టల్ లో టీఆర్ఎస్ నిర్వాకం అంటూ బీజేపీ సోషల్ మీడియాలో ఓ విమర్శనాత్మక పోస్టు పెట్టింది. ధరణి పోర్టల్ లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ను పాకిస్థాన్ లో కలిపేశారని, అక్సాయ్ చిన్ ను చైనాలో కలిపేశారని బీజేపీ ఆరోపించింది.

బీజేపీ దీనిపై తీవ్ర నిరసన తెలపడంతో ఆ మ్యాప్ ను మార్చివేశారని, 2011-12 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పెట్టారని వివరించింది. కనీసం తెలంగాణ మ్యాప్ ను కూడా సంపాదించలేని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ సర్కారు అని ఘాటుగా విమర్శించింది. వీళ్లు తెలంగాణవాదం గురించి మాట్లాడుతున్నారని, ప్రధాని మోదీపై బురదజల్లుతూ దొంగనాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News