Off Beat: లేస్ చిప్స్ ప్యాకెట్ల కవర్ తో చీర.. దాన్ని కట్టుకుని మురిసిపోయిన యువతి.. ఇదిగో వీడియో

  • ప్యాకెట్ లోపలి భాగం కనిపించేలా చీర
  • చీరకు అంచులుగా ప్యాకెట్ బయటి భాగం
  • ఓ మై గాడ్ అంటున్న నెటిజన్లు
A Girl Draped In Lays Chips Packets Goes Viral On Social Media

అగ్గిపెట్టె, సబ్బుబిళ్ల, కుక్కుపిల్ల.. కాదేదీ కవితకు అనర్హమని అన్నారు మహాకవి శ్రీశ్రీ. కవితల మాటేమోగానీ.. ఇప్పటితరం మాత్రం కొత్త కొత్త పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నారు. అందుకు ఇదిగో ఈ అమ్మాయే ఉదాహరణ.

లేస్ చిప్స్ ప్యాకెట్లతో చీర తయారు చేసుకున్న ఆ యువతి.. దానిని కట్టుకుని తెగ మురిసిపోయింది. ప్యాకెట్ లోపలి భాగం బయటకు కనిపించేలా చీరను తయారు చేసి.. దానికి అంచుగా ప్యాకెట్ బయటి భాగం కనిపించేలా పల్లునూ కుట్టింది.

ఫర్ ద లవ్ ఆఫ్ బ్లూ లేస్ అండ్ శారీ అనే క్యాప్షన్ పెట్టి యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో వీడియోను వదిలింది. ఇంకేముంది, ఆ వీడియో కాస్తా తెగ వైరల్ అయింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఓ మైగాడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

More Telugu News