Tollywood: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన షణ్ముఖ్.. చాయ్ బిస్కెట్ ఫేం శ్రీవిద్యతో కలిసి గృహ ప్రవేశం

Shanmukh House Warming Function With Chai Biscuit Fame Sri Vidya
  • వైరల్ గా మారిన ఫొటోలు
  • ఎవరా అమ్మాయి? అంటూ చర్చ
  • ఇటీవలే దీప్తి సునయనతో షణ్ణూ బ్రేకప్
యూట్యూబర్ షన్ముఖ్ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సిరితో కలిసి అతడు చనువుగా ఉన్న ఘటనలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. అయితే, ఆ  తర్వాత ఆ కారణం వల్లనో లేదా వేరే కారణమో తెలియదుగానీ.. షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పేసినట్టు దీప్తి సునయన ప్రకటించింది. అతడు కూడా వేరుపడినట్టు తెలిపాడు.


తాజాగా అతడు కొత్త ఇల్లు కొనుగోలు చేసి అందులోకి వెళ్లాడు. చాయ్ బిస్కెట్ ఫేం శ్రీవిద్యతో కలిసి గృహ ప్రవేశం చేశాడు. పాలు పొంగించి పూజలు చేసి సంప్రదాయబద్ధంగా సొంత ఇంట్లోకి వెళ్లాడు. దీంతో షణ్ణుకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆ చిరునవ్వు, విజయాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామంటూ ఆకాంక్షించారు.

అయితే, షణ్ణు పక్కన కూర్చున్న ఆ అమ్మాయి ఎవరు? అంటూ శ్రీవిద్య గురించి అభిమానులు చర్చ మొదలుపెట్టారు. కాగా, కెరీర్ పరంగా ప్రస్తుతం షణ్ముఖ్ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. త్వరలోనే అది రిలీజ్ కానుంది.  



Tollywood
Shanmukh
Chai Biscuit
Sri Vidya

More Telugu News