Raviteja: భారీస్థాయిలో జరిగిన 'ఖిలాడి' ప్రీ రిలీజ్ బిజినెస్!

  • రవితేజ తాజా చిత్రంగా 'ఖిలాడి'
  • కథానాయికలుగా మీనాక్షి, డింపుల్
  • కీలక పాత్రలో అర్జున్
  • ఈ నెల 11వ తేదీన విడుదల
Khiladi movie update

రవితేజ కథానాయకుడిగా 'ఖిలాడి' సినిమా రూపొందింది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుందని చెబుతున్నారు.

ఒక్క నైజామ్ ఏరియాలోనే 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని అంటున్నారు. క్రితం ఏడాది రవితేజ నుంచి వచ్చిన 'క్రాక్' సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. రవితేజ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ ఎఫెక్ట్ వల్లనే ఈ సినిమా బిజినెస్ ఈ రేంజ్ లో జరిగిందని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. టీజర్ .. ట్రైలర్ లు అంచనాలు పెంచాయి. కథానాయికలుగా మీనాక్షి చౌదరి -  డింపుల్ హయతి అలరించనున్నారు. కీలకమైన పాత్రలో అర్జున్ కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం పార్క్ హయత్ హోటల్లో జరగనుంది.

More Telugu News