Raj Nath Singh: ఈ పుష్పలో ఫ్లవరూ ఉంది, ఫైరూ ఉంది.. రాజ్ నాథ్ సింగ్ నోట 'పుష్ప' డైలాగులు!

Raj Nath Singh speaks about Pushpa movie
  • ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 'పుష్ప' సినిమాను ప్రస్తావించిన రాజ్ నాథ్
  • పుష్పకు, సీఎం పుష్కర్ కు మధ్య పోలిక తెచ్చిన వైనం
  • ఉత్తరాఖండ్ లో కూడా ఒక పుష్ప ఉన్నారని వ్యాఖ్య
అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా దక్షిణాదినే కాదు, ఉత్తరాదిన సైతం ఊపేసింది. ఎక్కడ విన్నా ఈ సినిమా డైలాగులే వినిపిస్తున్నాయి. తగ్గేదేలే, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనే డైలాగులు జనాల్లోకి వెళ్లిపోయాయి. రాజకీయ నాయకులు కూడా ఈ డైలాగులను వాడేసుకుంటున్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నోట కూడా 'పుష్ప' డైలాగులు వచ్చాయి. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ 'పుష్ప' సినిమాను ప్రస్తావించారు. ఈ సినిమాకు, సీఎం పుష్కర్ కు మధ్య పోలిక తీసుకొచ్చారు.

ఇప్పుడు అందరూ ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నారని... ఆ సినిమా పేరు 'పుష్ప' అని రాజ్ నాథ్ చెప్పారు. ఉత్తరాఖండ్ లో కూడా ఒక పుష్ప (సీఎం పుష్కర్ థామి) ఉన్నారని అన్నారు. ఈయన చాలా సౌమ్యంగా, సింపుల్ గా ఉంటారని... ఈయనలో కూడా ఫ్లవర్ ఉంది, ఫైర్ ఉందని చెప్పారు. పుష్కర్ ను ఎవరూ ఆపలేరని... ఈయన తగ్గేదేలే అని వ్యాఖ్యానిస్తూ జనాల్లో ఉత్సాహాన్ని నింపారు.
Raj Nath Singh
BJP
Pushpa
Allu Arjun
Tollywood
Uttarakhand
CM Pushkar

More Telugu News