Karnataka: పిచ్చుక మృతితో గ్రామస్థుల కన్నీళ్లు.. అంత్యక్రియలు నిర్వహించి, సమాధి నిర్మాణం!

  • కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలో ఘటన
  • గ్రామస్థులతో కలిసిపోయిన పిచ్చుక
  • శాస్త్రోక్తంగా దశదిన కర్మ
Villagers bid adieu to little chirp that brightened their days

గ్రామంలోని అందరి ఇళ్లకు వచ్చి వారు వేసే గింజలు తింటూ వారితో కలివిడిగా ఉండే పిచ్చుక మృతి చెందడంతో గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీని మృతిని జీర్ణించుకోలేకపోయారు. దానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి, సమాధి నిర్మించారు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా శిద్లగట్ట మండలం బసవనపట్టణ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

గ్రామంలో చాలా పిచ్చుకలు ఉండగా వాటిలో ఒకటి మాత్రం ప్రతి రోజూ అన్ని ఇళ్లకు వచ్చేది. వారు వేసే గింజలు తిని వెళ్లేది. దీంతో ఆ పిచ్చుకపై గ్రామస్థులు ఎనలేని మమకారం పెంచుకున్నారు. గత నెల 26న ఆ పిచ్చుక అకస్మాత్తుగా మరణించింది. అది చూసి గ్రామస్థులు తట్టుకోలేకపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. మనుషుల్లా దానికీ అంత్యక్రియలు నిర్వహించారు. దశదిన కర్మ జరిపించి తిరిగి రావాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ గ్రామంలో పోస్టర్లు ఏర్పాటు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం అందరికీ భోజనాలు పెట్టారు.

More Telugu News