'ఆడవాళ్లు మీకు జోహార్లు' టీజర్ రిలీజ్ డేట్ ఇదే!
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'
- శర్వానంద్ సరసన నాయికగా రష్మిక
- ఈ నెల 10న తేదీన టీజర్ రిలీజ్
- 25వ తేదీన సినిమా విడుదల
శర్వానంద్ - రష్మిక జంటగా నటించిన ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు.
సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై శర్వానంద్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశలను ఈ సినిమా ఎంతవరకూ నెరవేర్చుతుందో చూడాలి.
.