Talasani: కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వేం న్యాయం చేశావో చెప్పు: ప్రధాని మోదీని నిలదీసిన తలసాని

Talasani questions PM Modi
  • కాంగ్రెస్ విభజించిన తీరుతో నష్టం జరిగిందన్న మోదీ
  • ఇప్పటికీ ఏపీ, తెలంగాణ నష్టపోతున్నాయని వెల్లడి
  • ప్రధానిపైమండిపడిన తలసాని
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరుతో తెలంగాణ, ఏపీలకు ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వేం న్యాయం చేశావో చెప్పు అని ప్రధాని మోదీని నిలదీశారు. బాధ్యతతో ఉండాల్సిన ప్రధాని, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో ఇప్పుడాయన డ్రామాలు ప్రారంభించారని వ్యాఖ్యానించారు.

హైదరాబాదులో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మోదీ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ధార్మిక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించే మాట్లాడారని, తెలంగాణ అంటే మోదీకి ఎంత కక్ష ఉందో ఆయన మాటల ద్వారానే తెలుస్తోందని తలసాని అన్నారు. ప్రధాని పర్యటనకు రాష్ట్ర సర్కారు నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తే సరిపోతుందని, అయినా ప్రధాని పర్యటనను బాయ్ కాట్ చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. గత ఏడున్నరేళ్లుగా తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. 
Talasani
Narendra Modi
Telangana
Andhra Pradesh

More Telugu News