EPFO: ఉద్యోగుల భవిష్యనిధి వడ్డీపై వచ్చే నెలలో నిర్ణయం

  • గౌహతిలో వచ్చే నెల మొదట్లో ఈపీఎఫ్ వో సీబీటీ భేటీ
  • రేటుపై ఆడిట్ కమిటీ సిఫారసు
  • దీనిపై చర్చించిన అనంతరం ప్రకటన
EPFO meet next month to finalise interest rate

ఉద్యోగుల భవిష్యనిధి డిపాజిట్లపై 2021-22 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటే కొనసాగింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఉద్యోగుల భవిష్యత్ దృష్ట్యా రేటు తగ్గించలేదు.

మార్చి నెల మొదటి వారంలో గౌహతిలో ఈపీఎఫ్ వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశం జరగనుంది. దానికంటే ముందే బుధవారం (ఈ నెల 9న) ఈపీఎఫ్ వోకు చెందిన ఫైనాన్స్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఆడిట్ కమిటీ సమావేశం అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం ఆధారంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డిపాజిట్లపై ఎంత శాతం వడ్డీ రేటును ఇవ్వొచ్చన్న దానిపై స్పష్టతకు వస్తుంది.

అనంతరం సీబీటీకి సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసు వచ్చే నెల సమావేశానికి ఒక రోజు ముందు లేదా, సమావేశం రోజే ఇవ్వొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. సూచించిన రేటు లేదంటే సభ్యుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు స్వల్ప మార్పులతో రేటును సీబీటీ ఖరారు చేయవచ్చు.

More Telugu News